¡Sorpréndeme!

Virat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్

2025-04-21 4 Dailymotion

 ఐపీఎల్ ఆటే అలాంటిది. కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్. గెలుపు కోసం పాయింట్స్ కోసం ఎమోషన్స్ ను పణంగా పెట్టి ఆడేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. తద్వారా మంచి మిత్రులు శత్రువులు కావచ్చు...శత్రువులు మిత్రులుగానూ మారొచ్చు. నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో అదే జరిగింది. ఏకంగా విరాట్ కొహ్లీకి, శ్రేయస్ అయ్యర్ మధ్య వివాదం మొదలైంది. పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మొన్న ఇదే టీమ్ తో బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలోనే పటీదార్ సైన్యానికి షాక్ ఇచ్చాడు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్ లో ఆర్సీబీని 95 పరుగులకే పరిమితం చేసే ఆ టార్గెట్ ను ఛేజ్ చేశారు. ఈ సందర్భంగా అయ్యర్ అండ్ టీమ్ కాస్త అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయ్యర్ కూడా బెంగుళూరు ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ ఏదీ సౌండ్ వినపడట్లేదే అన్నట్లు కొన్ని సైగలు చేశాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకున్న విరాట్ కొహ్లీ నిన్న పంజాబ్ తో పంజాబ్ లో జరిగిన మ్యాచ్ టైమ్ లో వడ్డీ తో సహా తిరిగిచ్చేశాడు. నేహాల్ వధీరాను చేసి బెంగుళూరులో తమపై గెలిచినప్పుడు వధీరా ఇచ్చిన పోజునే కొహ్లీ కూడా ఇచ్చాడు. తన టీమ్ మేట్స్ తో కలిసి వైల్డ్ గా సెలబ్రేషన్స్ చేస్తూ పంజాబ్ పై ఘాటుగానే రిప్లైస్ ఇచ్చాడు. అయితే కొహ్లీ ఇంతిలా అగ్రెసివ్ అవ్వటానికి కారణం పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో. 19 వ తారీఖు మ్యాచ్ గెలవగానే అందరూ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇస్తుంది మరో టీమ్. ఆ సందర్భంలో మార్కో యాన్సన్ తో కొహ్లీ దిగిన ఫోటోను పంజాబ్ పోస్ట్ చేసింది. ఆరున్నర అడుగుల ఎత్తుండే మార్కో యాన్సన్ తో కొహ్లీ ఉన్న ఫోటో పెడ్డటం అంటే ఇన్ డైరెక్టర్ మీ స్థాయి ఇంత తక్కువ అని గేలి చేయటం అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తుకున్నారు. అందుకే ఈరోజు మ్యాచ్ గెలవగానే శ్రేయస్ అయ్యర్ ను చూస్తూ అరుస్తూ గోల చేశాడు విరాట్. దానికి అయ్యర్ కాస్త సీరియస్ ఫేస్ పెట్టాడు. మ్యాచ్ తర్వాత కొహ్లీ నవ్విస్తూ పలకరించి హగ్ చేసుకోవటానికి ట్రై చేసినా అయ్యర్ మాత్రం ముభావంగా ఉంటూ కొహ్లీ చేతిని తోసేస్తూ పక్కకి వెళ్లిపోయాడు. ఫలితంగా ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ అనే కొత్త రైవల్రీ టీమ్. అటు కొహ్లీ, ఇటు శ్రేయస్ అయ్యర్ కొత్త శత్రువులుగానూ తయారయ్యారా అనే సందేహం వస్తోంది.